విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రజలు తరఫున ఆయన బిడ్ వేశారు. రెండు సీల్డ్ కవర్లలో బిడ్డింగ్ కు అవసరమైన పత్రాలను అధికారులకు అందజేశారు. అంతకంటే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన పాదయాత్రకు జేడీ సంఘీభావం తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశ్రమను కాపాడుకునేందుకు ముందు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈఓఐలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బిడ్ ఆమోదం పొందుతుందని జేడీ లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. సరైన కారణం లేకుండా తిరస్కరిస్తే మంత్రిత్వశాఖను సంప్రదిస్తామని..అవసరమనుకుంటే కోర్టుకు కూడా వెళ్తామని జేడీ చెప్పారు. నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఇవ్వగలిగితే స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకుంటుందని, క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని వెల్లడించారు. ఎనిమిదన్నర కోట్ల మంది నెలకు రూ.100 చొప్పున ఇవ్వగలిగితే రూ.850 కోట్లు సేకరించడం సాధ్యమవుతుందని జేడీ స్పష్టం చేశారు. ఆ విధంగా నాలుగు నెలల పాటు ఇస్తే, స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో ప్రజలు కూడా భాగస్వాములవుతారని వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు జేడీ లక్ష్మీనారాయణ బిడ్ !
April 15, 2023
0
Tags