టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా కెప్టెన్లు, ట్రైనర్లతో సహా వెయ్యిమందికిపైగా పైలట్లను నియమించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌లైన్ విమానసంస్థలో 1800ల మందికిపైగా పైలట్స్ ఉన్నారు. మరో 470 విమానాలకు అందులో వైడ్-బాడీ విమానాలను నడిపే పైలట్లను నియమించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా నియామకాల్ 210 ఎ320/321, నియో/ఎక్స్‌ఎల్‌ఆర్, 40ఎ350-900/1000. బోయింగ్ సంస్థ నడిపే 190 737-మాక్స్, 20787లు, 10777 విమానాలు ఉన్నాయి. కాగా, వెయ్యిమంది పైలట్లను నియమించుకోనున్నట్లు గతేడాది జనవరిలో టాటా గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పైలట్లకు ఇచ్చే వేతనంపైనా, సర్వీస్ నిబంధనలపైన ఎయిర్‌లైన్ విధించిన తాజా నిర్ణయంపై ఎయిర్‌ఇండియా పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పైలట్లకు, క్యాబిన్ సిబ్బందికి పునరుద్ధరించబడిన నష్టపరిహారాన్ని కార్మిక చట్టాల ప్రకారం రూపొందించలేదని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ), ఇండియన్ పైలట్స్ గిల్డ్ (ఐపిజి) యూనియన్‌లు తిరస్కరించాయి. ప్రస్తుతం ఎయిర్‌ఇండియా, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎఐఎక్స్, విస్తారా వంటి వాటిని టాటాగ్రూప్ సంస్థ నడుపుతుంది.
ఎయిర్ ఇండియాలో కొత్తగా వెయ్యిమంది పైలట్లు !
April 27, 2023
0
Tags