కిలాడీ ప్రేమికులు !

Telugu Lo Computer
0


బెంగళూరు లోని మల్లేశ్వరం ప్రాంతంలో మరుగన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వృత్తి రీత్యా ఇతడు నేరస్తుడు కావడంతో స్థానిక ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలు చేశాడు. రెండేళ్ల కిందట ఓ బైక్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఈ మధ్యే బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఇతగాడికి యాస్మిన్ అనే అనాథ అమ్మాయితో పరిచయంఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ సినిమాలు, షికారులు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ ప్రేమికులు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకున్నారు. కానీ, చేతిలో చిల్లి గవ్వలేదు. ఆ సమయంలో వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగో ప్రియుడు మురగన్ దొంగతనంలో ఆరి తేరడంతో ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే స్థానిక పోలీసుల కళ్లు గప్పి మల్లేశ్వరం, శ్రీరాంపూర్, కొడిగేహళ్లి ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైక్ లను దొంగిలించేవారు. అలా కొన్ని రోజులు జీవితాన్ని గడిపారు. ఈ ప్రేమ జంట ఇటీవల మల్లేశ్వరం పరిధిలోని 15వ అవెన్యూలో కౌశిక్‌ అనే విద్యార్థి వద్ద సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. స్థానికులు అంతా గమనించి వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద ఉన్న 2 రెండు సెల్ ఫోన్లు, 3 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)