ఎంతో కష్టమైన ఆపరేషన్లు , తీవ్రమైన గాయాలకు, అత్యవసర కేసులకు ఎంబీబీఎస్ డాక్టర్లు సేవలు అందిస్తారని, అలాంటి డాక్టర్లతో సమాన వేతనానికి ఆయుర్వేద వైద్యులు అర్హులు కాలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ పట్టా ఉన్న డాక్టర్లతో సమానంగా ఆయుర్వేద డాక్టర్లను కూడా లెక్కలోనికి తీసుకోవాలని 11 ఏళ్ల కిందట గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయుర్వేదం ప్రత్యామ్నాయ లేదా దేశీ వైద్య విధానం మాత్రమేనని, ఆ మేరకు ఆయుర్వేదం ప్రాముఖ్యతను గుర్తిస్తామని తెలిపింది.
ఆయుర్వేద డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లతో సమాన జీతానికి అర్హులు కారు !
April 27, 2023
0
Tags