మనం పిల్లులతో కొట్లాడుతున్న ఎలుకలం

Telugu Lo Computer
0


వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఓ రాజకీయ శక్తిగా మారింది కాబట్టే ఆమెని ఇంటి నుంచి బయటకి రానివ్వడం లేదని చెప్పుకొచ్చారు ప్రజాగాయకుడు గద్దర్. తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏం రాలేదన్నారు. కేసీఆర్ పతనమయ్యే దశ వచ్చిందని గద్దర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కూలిపోయేలా ప్రణాళికతో ముందుకు వెళ్లి ఆయన్ని కూలగొట్టాలని పిలుపునిచ్చారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో పాల్గొన్న గద్దర్, నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే నినాదంతో షర్మిల తన పోరాటం మొదలు పెట్టారని తెలిపారు. వైఎస్ షర్మిల తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని అన్నారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సర్కార్ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట అనే నినాదంతో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గద్దర్  ''గ్రామాలకు తరలండి. ఓట్ల యుద్దానికి సిద్దం కండి. ప్రతి ఇంటిని బూత్ కమిటీగా మార్చండి. డబ్బుతోనే అధికారం లోకి రావచ్చని కేసీఆర్ ఫిక్స్ అయ్యాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే సమయంలో ఆయన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి. డబ్బులు లేవు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి. విద్యార్థులు రాజకీయ శక్తిగా మారాలి. అసెంబ్లీనీ, సెక్రెటరేయట్‌ను విద్యార్థులు చుట్టు ముట్టాలి. మనం పిల్లులతో కొట్లాడుతున్న ఎలుకలం'' అంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని స్పష్టం చేసిన గద్దర్.. షర్మిల ఆత్మ రక్షణ కోసమే తనను తాను డిఫెన్స్ చేసుకున్నారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)