దోశలు వేసిన ప్రియాంక !

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ మైసూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే విరామం తీసుకుని అల్పాహారం కోసం మైసూర్ లోని అత్యంత ప్రసిద్ధగాంచిన మైలారీ రెస్టారెంట్‌కి వెళ్లారు. ప్రియాంక గాంధీ వెంట కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాతో పాటు మరికొంత మంది ఉన్నారు. ప్రియాంక గాంధీ అల్పాహారం అనంతరం పార్టీ నేతలతో ముచ్చటించారు. కొంత విరామం అనంతరం సదరు హోటల్ లోని కిచెన్ కి వెళ్లి వంట వాళ్ళతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ సరదాగా దోశలు వేశారు. పెనం మీద ఆరు దోసెలు వేయగా సకాలంలో దోసెను తిప్పకపోవడంతో రెండు దోశలు మాడిపోయాయి. దీంతో అక్కడ నవ్వుల వాతావరణం నెలకొంది. అనంతరం రెస్టారెంట్ యజమానికి, వర్కర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ వారితో సెల్ఫీ దిగారు. ప్రియాంక గాంధీ దోస చేస్తున్న వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)