భారత్‌కు అమెరికా మద్దతు

Telugu Lo Computer
0


భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడం ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలను పెంచింది. చైనా తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంలో భారత్‌ అభ్యంతరాలపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ స్పందించారు. 'జాంగ్‌నన్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌) చైనాలో భాగమే. చైనా సార్వభౌమ హక్కుల పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని వెల్లడించారు. అయితే చైనా చర్యను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. 'ప్రాంతాల పేర్లను మార్చడం వంటి చర్యలతో భూభాగాలపై హక్కులను పొందాలనుకునే ఏకపక్ష ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం' అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జీన్‌ పెర్రీ పేర్కొన్నారు. భారత్‌, చైనా సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)