టీమిండియా మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ మృతి చెందారు. గత నెలలో బాత్ రూమ్ లో జారిపడ్డ సుధీర్ తలకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి కోమాలనే ఉన్న ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గవాస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, మన్కడ్ లాంటి స్టార్స్ అందుబాటులో లేని సమయంలో రంజీ రారాజు ముంబైను 1971 సీజన్ లో ఛాంపియన్ గా నిలిపిన ఘనత సుధీర్ నాయక్ ది. టీమిండియా తరఫున మూడు టెస్టులు, రెండు వన్డేలు ఆడారు సుధీర్. ఆయన మరణంతో మహారాష్ట్ర క్రికెట్ బోర్టు సహా పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో అద్భుదంగా రాణించారు సుధీర్ 40 యావరేజ్ తో బ్యాటింగ్ చేశారు. అప్పట్లో 40 యావరేజ్ అంటే ఏ మాత్రం తక్కువ కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్ల బ్యాటింగ్ సగటు అంతకంటే తక్కువున్న కాలమది. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో గొప్పగా రాణించడంలో టీమిండియాలో కాల్ వచ్చింది. ఇంగ్లండ్ లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన చివరి టెస్టు కోసం జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు సుధీర్. మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకు ఔట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులతో అదరగొట్టారు. అయితే తర్వాత సుధీర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. రంజీల్లో మాత్రం బాంబే తరపున తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేశారు. 1973-74 రంజీ ట్రోఫీలో బరోడాపై 200 పరుగులు బాదాడు. ఇక 1971లో వెస్టిండీస్ టూర్ లో ముంబై స్టార్స్ బిజీగా ఉన్న సమయంలో బాంబే టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సుధీర్.. ఎవరూ ఊహించని విధంగా కప్ తెచ్చిపెట్టారు. భిన్న పరిస్థితులను చాకచక్యంగా వినియోగించుకున్న సుధీర్ తనను తాను తెలివైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. సుధీర్ కోచ్ గా కూడా పని చేశారు. అంతేకాదు వాంఖడే గ్రౌండ్ క్యూరేటర్ గా మంచి పెరు తెచ్చుకున్నారు. వాంఖడే క్రికెట్ స్టేడియంలో అవుట్‌ఫీల్డ్‌ను చూసుకునే గ్రౌండ్ ఇన్‌ఛార్జ్‌గా కూడా సేవలందించారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన వాంఖడే క్రికెట్ పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను అద్భుతంగా సిద్ధం చేశారని విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ మృతి
April 06, 2023
0
Tags