పిన్న వయస్సులోనే రూ.1200 కోట్ల సంపద !

Telugu Lo Computer
0


కైవల్య వోహ్రా, ఆదిత్ పలీచా దుబాయ్‌లో పెరిగారు. ఇద్దరూ బాల్య స్నేహితులు. వీరిద్దరూ స్టాన్‌ఫోర్డ్ విద్యార్థులు. ఆంట్రప్రెన్యూర్‌షిప్ కోసం స్టాన్‌ఫోర్డ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్స్‌ను మధ్యలో వదిలేశారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీకి డిమాండ్ పెరుగుతుండటంతో, ఈ రంగంలో అవకాశాలను గమనించి స్టార్టప్ ప్రారంభించారు. కిరాణాకార్ట్ పేరుతో స్టార్టప్ ప్రారంభించి ఆన్‌లైన్ డెలివరీ కోసం కిరాణా షాపులతో ఒప్పందం భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత కిరాణాకార్ట్‌ను జెప్టోగా మార్చారు. 2021 నవంబర్‌లో 60 మిలియన్ డాలర్ల ఫండ్స్ సేకరించారు. ఈ ప్లాట్‌ఫామ్ కేవలం 10 నిమిషాల్లోనే గ్రాసరీని డెలివరీ చేస్తోంది. 2021 డిసెంబర్‌లో మరో రౌండ్ ఫండింగ్లో 100 మిలియన్ డాలర్లు సేకరించారు. అప్పుడు ఈ కంపెనీ విలువ 570 మలియన్ డాలర్లు. గతేడాది మేలో జెప్టోకు 200 మిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చింది. అప్పుడు కంపెనీ విలువ 900 మలియన్ డాలర్లు. జెప్టో వాల్యుయేషన్‌లో 50 శాతానికి పైగా పెరగడంతో, ఈ స్టార్టప్ వ్యవస్థాపకులైన వోహ్రా, పలీచా భారతదేశపు రిచ్ క్లబ్‌లో చేరిన అతి పిన్న వయస్కులు అయ్యారు. వోహ్రా సంపన్నుల జాబితాలోకి అడుగుపెట్టడం భారతదేశంలో స్టార్టప్‌ల పెరుగుతున్న ప్రభావానికి సూచిక అని హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక విడుదల చేసిన సందర్భంలో తెలిపింది. ఆదిత్ పలీచా స్టార్టప్ ప్రయాణం 17 ఏళ్ల వయస్సులోనే ప్రారంభమైంది. దుబాయ్‌లో గోపూల్ పేరుతో కార్‌పూల్ యాప్ రూపొందించారు. ఆ తర్వాత ప్రైవసీ పేరుతో ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్ రూపొందించాడు. చాలా మంది తమ కెరీర్‌ల గురించి గందరగోళంగా ఉన్న వయస్సులోనే ఆదిత్ పలీచా అద్భుత విజయాలను అందుకోవడం విశేషం. అతను 2022లో 900 మిలియన్ డాలర్లను దాటిన కంపెనీకి సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ 2021లోనే ప్రారంభించడం విశేషం. కొన్ని నెలల్లోనే కంపెనీ వ్యాల్యుయేషన్ రూ.7300 కోట్లకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)