గ్యాంగ్‌స్టర్లు అతీఖ్ అహ్మద్, అష్రఫ్‌ల హత్యోదంతంపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తునకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను (సిట్) ఏర్పాటు చేశారు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా జర్నలిస్టుల్లాగా వచ్చిన ముగ్గురు యువకులు వారిని కాల్చి చంపారు. ఈ కేసు దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెండు బృందాలను ఏర్పాటు చేశారు.మొదటి పోలీసు దర్యాప్తు బృందానికి అసిస్టెంట్ డీసీపీ సతీష్ చంద్ర నాయకత్వం వహిస్తారు. రెండో సిట్ బృందంలో ప్రయాగరాజ్ పోలీసు విభాగానికి చెందిన ముగ్గురు అధికారులుంటారు.ఈ కేసును షహగంజ్ పోలీసులు రిజిస్టర్ చేశారు. తన కుమారుడిని పూడ్చిపెట్టిన శ్మశానవాటికలోనే అతీఖ్ సోదరుల మృతదేహాలను ఖననం చేశారు. వీరి అంత్యక్రియలకు కొద్దిమంది అతీఖ్ బంధువులు,స్థానికులను మాత్రం పోలీసులు అనుమతించారు. ఈ హత్య ఉదంతం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర మంత్రుల పర్యటనలను వాయిదా వేశారు. ఈ ఘటన దృష్ట్యా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు. అతీఖ్ హంతకుల్లో ఒకరైన సన్నీకి గ్యాంగ్ స్టర్ సుందర్ భాటితో సంబంధాలున్నాయని తాజాగా వెల్లడైంది. గౌతంబుద్ధనగర్ జిల్లాకు చెందిన సుందర్ భాటి 60 కేసుల్లో నిందితుడు. హత్యలు, డబ్బు వసూళ్లు, దోపిడీ కేసుల్లో సుందర్ భాటి నిందితుడు. అతీఖ్ ను కాల్చి చంపిన సన్నీ హమీర్ పూర్ జైలులో సుందర్ భాటిని కలిశారని తేలింది.
అతీఖ్ అహ్మద్ హత్య ఘటనపై రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు !
April 17, 2023
0
Tags