అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

Telugu Lo Computer
0


తెలంగాణ లోని భద్రాచలం పట్టణంలో  ప్రైవేట్ లాడ్జినందు అనుమానస్పద స్థితిలో మహిళ ఉరేసుకుని మృతి చెందింది. కల్లూరు ప్రాంతానికి చెందిన అరుణ (35) అనే మహిళ శనివారం ఉదయం లాడ్జికి చేరుకుంది. శనివారం సాయంత్రం ఆమె సమీప బంధువైన ఆంజనేయులు (30) కూడా అదే లాడ్జికి వచ్చి ఆమె రూమ్‌కు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆదివారం సాయంత్రం ఆ మహిళ ఉరేసుకొని చనిపోయింది. మహిళతో పాటు ఉన్న యువకుడు మాత్రం పూర్తిగా మద్యం మత్తులోనే ఉన్నాడు. మహిళ మృతిపై లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు లాడ్జికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెతో ఉన్న యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతురాలు వివాహితగా తెలుస్తుంది. ఆమె ఆత్మహత్యకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ తగాదాలు, అక్రమ సంబంధం, ఆస్తి తగాదాలు సహా ఇతర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)