స్టూడెంట్ వీసాపై అమెరికా ప్రీమియం ప్రాసెసింగ్ !

Telugu Lo Computer
0


అమెరికాలో పలు కేటగిరీలకు చెందిన వివిధ దేశాల విద్యార్థుల వర్క్ ఆథరైజేషన్ దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది భారతీయ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత విద్య కోసం అమెరికా వస్తున్న విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరం కానుంది. ఎస్టీఈఎమ్ సబ్జెక్టులకు సంబంధించిన అంతర్జాతీయ విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పొడిగింపు దరఖాస్తులను మార్చి 6వ తేదీ నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ కు అనుమతిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం ప్రకటించింది. మరికొన్ని ఇతర విభాగాల ప్రీమియం ప్రాసెసింగ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ ఫిల్లింగ్ ఫెసిలిటీ USCIS వెబ్ సైట్లో అందుబాటులో ఉందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జాదౌ తెలిపారు. అర్హత కలిగిన అంతర్జాతీయ విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. స్టెమ్ సహా వివిధ కేటగిరీల ఎఫ్ 1 వీసా  విద్యార్థుల ఓపీటీ పొడగింపు దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ కు అమెరికా తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రీమియం ప్రాసెసింగ్ ను అభ్యర్థిస్తూ దరఖాస్తు చేసుకునే ఐ 907 ఆన్ లైన్ ఫిలింగ్ ప్రొసీజర్ ఇప్పుడు స్టెమ్ సహా పలు కేటగిరీల ఎఫ్ 1 విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఓపీటీ అనుమతులు పొందడంలో నెలకొంటున్న జాప్యం ఈ నిర్ణయంతో తొలగిపోతుందని భావిస్తున్నారు. I-765 ఫామ్ పెండింగ్ లో ఉన్న ఎఫ్ 1 స్టుడెంట్స్ కూడా ఇప్పుడు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఐ 907 ఫామ్స్ ను USCIS కి పంపించవచ్చు. అలాగే, స్టెమ్ సహా పలు కేటగిరీల విద్యార్థులు ఏప్రిల్ 3 నుంచి I-765 ఫామ్, I-907 ఫామ్ లను ఒకేసారి సబ్మిట్ చేయవచ్చు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఏపీటీ అప్రూవల్స్ త్వరితగతిన లభిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)