దిగొచ్చిన వంట నూనె ధరలు !

Telugu Lo Computer
0


విదేశీ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పడిపోవడం, అదే సమయంలో దేశీ మార్కెట్‌లో ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి పెరగడం వంటి అంశాలు కారణంగా ల దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. మస్టర్డ్ ఆయిల్ ధర ఏడాది కిందట లీటరుకు రూ. 165 నుంచి రూ. 170 వద్ద ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ ధర లీటరుకు రూ. 135 నుంచి రూ. 140 వరకు ఉంది. అలాగే రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ రేటు రూ. 115- రూ. 120కు పడిపోయింది. ఇది వరకు దీని రేటు రూ. 140- రూ. 145గా ఉండేది. సన్ ఫ్లవర్ ఆయిల్   రేటు ఏడాది కిందట లీటరుకు రూ. 135 - రూ. 140గా ఉండేది. ఇప్పుడు ఈ ఆయిల్ ధర రూ. 115 - రూ. 120కు దిగి వచ్చింది. మస్టర్డ్ ఆయిల్ రేటు ఫిబ్రవరి నెలలో దాదాపు 10 శాతం మేర క్షీణించింది. సోయాబీన్ ఆయిల్ ధర 3 శాతం మేర దిగి వచ్చింది. అంటే గత నెలలో కూడా ఆయిల్ రేట్లు బాగానే తగ్గాయి. క్రూడ్ పామ్ ఆయిల్ ధర ఏడాది ప్రాతిపదికన దాదాపు 30 శాతం తగ్గింది. లీటరుకు రూ. 95 కు దిగి వచ్చింది. అలాగే ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధర 25 శాతం క్షీణించింది. లీటరుకు రూ. 100కు పడిపోయింది. సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్‌కు చెందిన వ్యాపారులు మాట్లాడుతూ  హోలి సందర్భంగా డిమాండ్ పెరినప్పటికీ ధరలు మాత్రం దిగి వచ్చాయని పేర్కొంటున్నారు. బ్రెజిట్, అర్జెంటినా, మలేసియా వంటి దేశాల్లో ఆయిల్ ఉత్పత్తి పెరిగిందని తెలియ జేస్తున్నారు. అలాగే దేశీయంగా ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి పెరిగిందని తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)