ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మార్చి1న ఓ వ్యక్తి బ్యాగులో డబ్బు పెట్టుకుని బైక్‌పై రావడాన్ని గమనించిన ముగ్గురు దొంగలు, అతడిని కొంతదూరం అనుసరించారు. మార్గమధ్యంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగగానే, వెనకే వచ్చి చోరీకి పాల్పడ్డారు. వాహనదారుడు ముందు సిగ్నల్ చూస్తుండగానే దొంగల్లో ఒకడు వెనుక బ్యాగ్ జిప్ తెరిచాడు. మరోవ్యక్తి అందులోని డబ్బుల బ్యాగ్ తీసుకుని ఇంకొకరికి అందించాడు. క్షణాల్లో పని ముగించుకుని ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో డబ్బులున్న బ్యాగ్‌ను ఆ వాహనదారుడు భుజానికే తగిలించుకుని ఉన్నాడు. అయినా అతడు చోరీని గమనించలేదు. ఆ సమయంలో బైక్ పక్కనే కార్లు కూడా ఆగి ఉన్నాయి. బైక్ ముందు నుంచి కొందరు పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయినా ఏ ఒక్కరూ దొంగతనాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సిసిటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్లో ఇద్దర్ని అరెస్టు చేశారు. దొంగల నుంచి రూ.38 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు ద్విచక్ర వాహనదారులను లక్షంగా చేసుకుని చోరీలకు పాల్పడే ముఠా అని పోలీసులు వెల్లడించారు.
భుజానికి బ్యాగ్ ఉండగానే రూ.40 లక్షలు కొట్టేశారు !
March 07, 2023
0
Tags