కవిత దీక్ష కేసీఆర్ ఇంటి ముందు చేయాలి !

Telugu Lo Computer
0


మహిళా బిల్లులపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు, కాబట్టి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందంటూ విమర్శించారు. బీఆర్ ఎస్ పార్టీలోనే 33% రిజర్వేషన్ పాటించడం లేదు.  కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు కేసీఆర్ ఇంటి ముందుంటూ షర్మిల విమర్శలు చేశారు. లిక్కర్ స్కాంపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదంటూ  షర్మిల విమర్శించారు. ఢిల్లీలో కవిత సోనియా గాంధీని పొగుడుతారు.. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తే వీళ్లంతా ఏకమవుతున్నట్టుగానే భావించాలని చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)