మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వైశాలి ధను అనే మహిళ తన కుమారుడితో కలిసి పుల్‌పాదా ప్రాంతంలోని గాంధీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. గురువారం ఓ వివాహ వేడుకలో కుటుంబ సమస్యల నేపథ్యంలో తల్లి, కుమారుడు గొడవ పడ్డారు. అదే రాత్రి ఇద్దరు మధ్య మళ్లీ గొడవ జరగడంతో తల్లిని కుమారుడు గొంతు నులిమి హత్య చేశాడు. వైశాలి బెడ్ మీద అచేతనంగా పడిఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్షలో గొంతు నులిమి హత్య చేసినట్టు తేలడంతో కుమారుడి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లిని గొంతు నులిమి చంపిన కుమారుడు !
March 10, 2023
0
Tags