పవిత్ర ను పెళ్లి చేసుకున్న నరేష్

Telugu Lo Computer
0


సినీ నటీనటులు నరేష్ - పవిత్ర పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షం ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి ఏ తేదీన జరిగింది.. ఎక్కడ జరిగింది అనేది స్పష్టం చేయలేదు. పెళ్లి వీడియోను నరేష్ విడుదల చేశారు. మొదటి పెళ్లిలో ఎంత హ్యాపీగా ఉంటారో.. అంతకు రెట్టించిన ఉత్సాహం నరేష్ - పవిత్రలో కనిపించింది. ఒకరికి ఒకరు అన్నట్లు ముచ్చటగా పెళ్లి వేడుక చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవలే వీళ్లిద్దరూ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు పెళ్లి వీడియో రిలీజ్ అయ్యింది. నరేష్ పెళ్లి విషయంలో వివాదం నడుస్తుంది. భార్య రమ్యతో కొంత కాలంగా నడుస్తున్నాయి.. ఈ క్రమంలోనే విడాకులు ఇవ్వకుండానే ఎలా పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరేష్ - రమ్య మధ్య గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. కేసులు నమోదయ్యాయి. ఇలాంటి టైంలో ఏ దైర్యంతో నరేష్ పెళ్లి వీడియో రిలీజ్ చేశాడనేది ఆసక్తిగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)