ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా హరమావు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గుడిసెకు నిప్పంటుకోవడంతో ఆ గుడిసెలో నివసిస్తున్న దంపతులు, వారి ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న సతీష్ (27) ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా తన భార్య కాజల్ (24), కుమారులు సన్నీ (7), సందీప్ (4), గుడియా (2)తో కలిసి తన గుడిసెలో నిద్రించాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున గుడిసెకు నిప్పంటుకుని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని శాంపిల్స్ సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగతుందని చెప్పారు.
గుడిసెకు నిప్పంటుకుని ఐదుగురు సజీవ దహనం
March 12, 2023
0
Tags