రేపటి నుంచి రెండో దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం !

Telugu Lo Computer
0


మార్చి 13నుంచి పార్లమెంటు బడ్జెట్ సెకండ్ సెషన్  ప్రారంభమవుతుంది. లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలని ఓ బిజెపి ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్, ప్రతిపక్షాలు అదానీ గ్రూప్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సమాయత్తం అవుతున్నాయి. రాజ్యసభలో ధన్‌కర్, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగేలా కనిపిస్తుంది. ధరల పెరుగుదలపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కూడా నిలదీసే ఆస్కారం ఉంది. ప్రధానంగా ఆర్జెడి నాయకులు, ఆప్ నాయకులు, బిఆర్‌ఎస్ నాయకులపై చేపట్టిన చర్యలు లేవనెత్తే అవకాశం వుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)