కోవిడ్ నిబంధనలను తొలగించి పార్లమెంటరీ సమావేశాలకు జర్నలిస్టులకు అనుమతివ్వాలని ఎడిటర్ల సంఘం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో '2020లో కోవిడ్ - 19 నిబంధనల్లో భాగంగా సెంట్రల్ హాల్‌లోకి మీడియా ప్రతినిధులను పరిమిత సంఖ్యకే పరిమితం చేయబడింది. ఆ పద్ధతే ఇప్పటికీ కొనసాగుతోంది. పార్లమెంటు లోపల జరిగే పరిణామాలను కవర్ చేయడానికి జర్నలిస్టులకు అనుమతినివ్వాలి' అని ఆ లేఖలో ఎడిటర్ల సంఘం పేర్కొంది. గత శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా అక్రిడేషన్, సుదీర్ఘ అనుభవం ఉన్న మీడియా వ్యక్తులను కూడా సెంట్రల్ హాల్లోకి అనుమతినివ్వలేదని ఎడిటర్ల సంఘం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు రాసిన లేఖలో పేర్కొంది. కోవిడ్ సమయంలో పరిమిత వ్యక్తులకే అనుమతినివ్వడం అభినందించదగ్గ విషయమే. కానీ కోవిడ్ నిబంధనలు సడలించి..అన్ని కార్యాకలాపాలు సాధారణమైనప్పుడు కూడా జర్నలిస్టులను గతంలోలాగా అనుమతించడం లేదు. ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో కూడా ఇప్పుడు విధించినన్నీ ఆంక్షలు మీడియా మిత్రలకు అప్పుడు విధించలేదు' అని ఆ లేఖలో స్పష్టంగా ఎడిటర్ల సంఘం పేర్కొంది. 'ప్రజలకు సమాచారమివ్వడానికి శాసనసభలకి, ప్రెస్‌కి మధ్య సమన్వయం ఉండాలి. అది ప్రజాస్వామానికి మంచిది. అలా కాకుండా.. జర్నలిస్టులను పార్లమెంటరీ కార్యాకలాపాలకు దూరంగా ఉంచేలా చేయడం మంచిది కాదు' అని లేఖ పేర్కొంది. కాగా, టెంపరరీ విజిటింగ్ జర్నలిస్టు పాస్‌ల మంజూరు చేయాలని, మూడేళ్లుగా లోక్‌సభ ప్రెస్ అడ్వజరీ కమిటీని ఏర్పాటు చేయలేదని దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలో ఎడిటర్లు పేర్కొన్నారు. అలాగే సెంట్రల్ హాల్‌తో సహా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులందరికీ అనుమతినివ్వాలి. జర్నలిస్టు కార్డులు పునరుద్ధరించాలని ఎడిటర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
వార్తలను కవర్ చేయడానికి జర్నలిస్టులకు అనుమతినివ్వాలి !
February 11, 2023
0
Tags