పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ కాగా మరి కొంతమంది నూతన గవర్నర్లుగా నియమించబడ్డారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెదం తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వారి స్థానంలో మహారాష్ట్రకు రమేష్ బయాస్, లడఖ్‌కు బ్రిగేడియర్ బి.డి. మిశ్రా (రిటైర్డ్)ను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్ గవర్నర్‌గా సి.పి రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ (రిటైర్డ్), ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బిశ్వ భూషణ్ హరిచందన్, మణిపూర్ గవర్నర్‌గా అనుసూయా ఉక్యే, నాగాలాండ్ గవర్నర్‌గా గణేశన్, మేఘాలయ గవర్నర్‌గా ఫాగు చౌహాన్, బీహార్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్
February 12, 2023
0
Tags