వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే వరుస ప్లాపులతో కుగిపోయిన బాలీవుడ్ సినిమాకు.. పఠాన్ ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక.. బాలీవుడ్‌లో మరే ఇతర పెద్ద సినిమా రాకపోవడం ఈ సినిమాకు కలిసివచ్చింది. ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా.. ఈ సినిమాకు అడిక్ట్ అవుతున్నారు. ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా పఠాన్ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 15 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి.. తన సత్తా చాటింది. ఇండియన్ సినిమాల్లో ఈ రికార్డు సాధించిన రెండో చిత్రంగా పఠాన్ నిలిచింది. బాహుబలి-2 తరువాత ఈ మార్క్‌ను అందుకున్న మూవీగా పఠాన్ రికార్డు నెలకొల్పింది.
రూ. 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతున్న పఠాన్ !
February 11, 2023
0
Tags