జీతాలివ్వడంలేదని అడిగిన వ్యక్తిని నడుం విరగ్గొట్టిస్తానన్న మంత్రి !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా,  గోల్ఖెడా ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి విజయ్ షా పాల్గొని  ప్రసంగిస్తున్నప్పుడు ఓ వ్యక్తి లేచి తన భార్య అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్నదని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని తెలిపాడు. దయచేసి జీతాలు వచ్చేట్టు చూడాలని మంత్రిని కోరాడు. దాంతో మంత్రి విజయ్ షా కు ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. ఈ సమావేశాన్ని చెడగొట్టడానికి వచ్చావా ? నీ నడుం విరగ్గొట్టిస్తానని హెచ్చరించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో, ప్రశ్నించిన వ్యక్తిని మందు తాగించి కాంగ్రెస్ పార్టీ పంపిందని మంత్రి ఆరోపించారు. "మేము మధ్యప్రదేశ్‌లో అభివృద్ధి శకానికి నాంది పలుకుతున్నాం. ఇది ప్రభుత్వ సమావేశం. దీనికి అంతరాయం కలిగించే వారి నడుమును పోలీసులచే విరిగ్గొట్టిస్తాను. ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్‌ నేత నీకు ఎంత ఇచ్చారు?'' " అని షా ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి షా, "నాకు తెలుసు, అతను మద్యం తాగించి ప్రజలను రెచ్చగొట్టి నామీదికి పంపుతాడు." అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న విషయం తనకు తెలుసని, మద్యం అమ్ముతున్న వ్యక్తులను పట్టుకోవాలని అక్కడున్న పోలీసులను విజయ్ షా ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)