బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “అప్పట్లో భారత్ లో హిందువులను వేధించారు. బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరింది. అయితే, ఇప్పటికీ దేశంలో పలు బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు వంటివి భూములు తీసుకుంటున్నాయి. అయితే, అవి వారి భూములు కాదు” అని ఆరోపణలు గుప్పించారు. “హిందువులు తమ సొంత నిబంధనలను పాటిస్తారు. వారి మతం గురించే మాట్లాడతారు. తమ మతాన్ని పాటిస్తారు. ఎక్కడా ఎవరినీ వ్యతిరేకించరు. దేవతల మందిరాలు ట్రస్టులుగా మారి, ప్రభుత్వ చేతుల్లోకి వెళ్తున్నాయి. వాటి నుంచి స్వేచ్ఛను ఇవ్వాలి. హిందువులు ఇచ్చే నిధులు, మందిరాలకు వచ్చే విరాళాలను హిందువుల అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలి. హిందువుల పిల్లల చదువులకు వినియోగించాలి. అలాగే, సనాతన ధర్మ అభివృద్ధికి, మందిరాల నిర్మాణాలకు వాడాలి. అందుకే సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి” అని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. మోదీ ప్రభుత్వ పాలనలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రాయాస్ నినాదంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. సనాతన బోర్డుని ఏర్పాటు చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. హిందూ మతం మన మతమని, మన సొంత నిబంధనలనే మనం పాటించాలని అన్నారు. దానిపై ఎటువంటి దాడీ జరగకూడదని చెప్పారు.
సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి !
February 15, 2023
0
Tags