హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని పురానాపూల్ లో కూలర్ల గోడౌన్ లో మంటలు చెలరేగాయి. దీనితో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఆరు ఫైర్‌ ఇంజిన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పొగ ఆ ప్రాంతాన్ని కప్పేయడం, భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)