పాక్ కు తలనొప్పిగా తయారైన తాలిబన్లు !

Telugu Lo Computer
0

ఆఫ్ఘన్‌లో అధికారం చెలాయిస్తోన్న తాలిబన్లు, ఇప్పుడు పాక్‌పై కన్నుపడింది. పాకిస్తాన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబన్లకు సన్నిహితమైన తెహ్రీక్‌ ఇ తాలిబన్ ద్వారా పాకిస్తాన్‌లో చెలరేగిపోతోంది. ప్రధాని షెహబాజ్‌ ప్రభుత్వానికి పోటీగా ఉత్తర పాకిస్తాన్‌లో సమాంతర సర్కార్‌ను నెలకొల్పి పాలిస్తోంది. కేవలం ప్రభుత్వాన్నే కాదు,  తెహ్రీక్‌ ఇ తాలిబన్ గ్రూప్‌ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్నే సవాలు చేయడంతో పాలక వర్గం, సైన్యం డిఫెన్స్‌లో పడ్డాయి. ఎలా ఎదుర్కోవాలో తెలియక పాలకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవైపు ఉత్తర పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతూనే, మరోవైపు పాక్‌ బోర్డర్‌లో దాడులు చేస్తున్నారు. తెహ్రీక్‌ ఇ తాలిబన్ పాకిస్తాన్‌ గ్రూప్‌ను టీటీపీగా పిలుస్తారు. ఈ గ్రూప్‌ను పాకిస్తాన్‌ తాలిబన్‌ అని కూడా అంటారు. ఇది ఆఫ్ఘన్‌ తాలిబన్‌కి అనుబంధ సంస్థ. ఈ గ్రూపే ఇప్పుడు ఉత్తర పాకిస్తాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. దాంతో, షెహబాజ్‌ సర్కారు ఉలిక్కిపడింది. ఆర్మీ ఆఫీషియల్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రధాని షెహబాజ్‌ ఏర్పాటు చేశారు.  పాకిస్తాన్‌ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తే, ఆఫ్ఘన్‌లోకి చొచ్చుకొచ్చిమరీ దాడి చేస్తామని పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా హెచ్చరించారు. ఈ ప్రకటనతో తాలిబన్లు మరింత చెలరేగిపోతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)