కర్ణాటకలో మోడీ మ్యాజిక్‌ పని చేయదు !

Telugu Lo Computer
0


గుజరాత్‌ ఫలితాల తర్వాత కలుబరిగిలో కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో మోడీ మ్యాజిక్‌ సాగదని చెప్పారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యమైనాయన్నారు. అక్కడ బీజేపీనే గెలుస్తుందని కాంగ్రెస్ వారు కూడా భావించారన్నారు. గుజరాత్‌ రాజకీయాలు వేరని, కర్ణాటకతో సంబంధం లేదన్నారు. పైగా రెండు రాష్ట్రాల మధ్య సుదూరమన్నారు. గుజరాత్‌లో గెలుపు బీజేపీ సాధన కాదని ఇది రాష్ట్ర ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపదన్నారు. రాష్ట్ర ప్రజలకు మోదీ మ్యాజిక్‌ గురించి తెలుసని ఎద్దేవా చేశారు. ఆప్‌కు బీజేపీ ఫండింగ్‌ చేసిందనే కాంగ్రెస్‌ అరోపణలపై మాట్లాడుతూ ఆప్‌ను బీటీం అంటూ వ్యాఖ్యానించేది లేదని తేల్చి చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు కొందరు జేడీఎస్‏ను బీజేపీకి బీటీం అన్నారని ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అన్నారు. కాంగ్రెస్ కు నాయకత్వ లోపం ఉందని అంతే కానీ ఓటమికి ఆప్‌ కారణమనేది సరికాదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)