ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని బిలాల్‌పట్ గ్రామంలో పెళ్లికొడుకు ముక్కు చిన్నగా ఉందని కొంతమంది మహిళలు గుస గుసలాడుకోవడం వధువు చెవిన పడటంతో అతడ్ని చేసుకోనంటే చేసుకోనని మొండికేసింది. కుటుంబసభ్యులు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా ఆమె మాత్రం ససేమిరా అంది. దీంతో వివాహం రద్దయ్యింది. తల్లిదండ్రుల అంగీకారంతో ఆ గ్రామంలో ఓ యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనంతరం వివాహ వేడుకల్లో భాగంగా వరుడి కుటుంబీకులు ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వరుడి ముక్కు చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు. అది విని పెళ్లి కూతురు పెళ్లికి నో చెప్పింది. పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ముక్కు చిన్నగా ఉందని పెళ్లి రద్దు !
December 09, 2022
0
Tags