ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రసంగిస్తూ దేశంలోని అన్ని కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రెండు నెలల వ్యవధిలో పెండింగ్ కేసులు 5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 4.83 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా, కింది కోర్టుల్లో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కింది కోర్టుల్లో మౌలిక వసతులు లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోందని చెప్పారు. సత్వర న్యాయం అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై విశ్లేషించాల్సి ఉందన్నారు. పెండింగ్ కేసులపై పార్లమెంటులోనూ, ఇతర చోట్లా జవాబు చెప్పాల్సింది తానేనని అన్నారు. సమాధానం ఇవ్వడం కష్టమవుతోందని, భవిష్యత్తులో కాగిత రహిత డిజిటల్ జ్యుడీషియరీ ఏర్పాటు కానుందని, అప్పుడు కాలహరణ చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో 4.83 కోట్ల కేసులు పెండింగ్ !
December 07, 2022
0
Tags