బెంగుళూరు గ్రామీణ జిల్లా టీకల్ ఫిర్కా చంబె గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి నవంబర్ 21న కనిపించకుండా పోవడంపై తాలూకాలోని మాస్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల తనిఖీలో అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు తేలింది. హొసకోటె తాలూకా భీమకరనహళ్లి గ్రామంలోని చెరువులో ఒక శవం లభ్యమైంది. దీనిపై నందగేడి పోలీస్ స్టేషన్‌లో అపరిచిత శవం లభ్యం కేసు నమోదైంది. తనిఖీ సమయంలో అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మారింది. చైత్ర, పృథ్వీరాజ్‌ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సరసానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలంచిన చైత్ర ప్రియుడితో కలిసి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు మాస్తి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఆనంద్ భార్య చైత్ర, పృథ్వీరాజ్, చలపతిలను అరెస్టు చేశారు. మరో నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడు.
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
December 07, 2022
0