రూ.12 లక్షల విలువైన వజ్రం లభ్యం !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాకు చెందిన హుక్మాన్‌ అహిర్వార్‌ అనే కార్మికుడు వజ్రాల మీద మక్కువతో, పన్నాలోని వజ్రాల గనిలో కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. చాన్నాళ్లు శ్రమించినా అతనికి 8 చిన్న వజ్రాలు మాత్రమే లభించాయి. గనుల తవ్వకం కారణంగా చేసిన అప్పులను తీర్చడానికి తనకున్న రెండున్నర ఎకరాల భూమిని సైతం అతను అమ్మేశాడు. వజ్రాల అన్వేషణను మాత్రం ఆపలేదు. ఈ క్రమంలో సోమవారం అతడి కష్టానికి ఫలితం దక్కింది. 4.5 క్యారెట్ల వజ్రం దొరికింది. అహిర్వార్‌ దానిని వజ్రాల కార్యాలయంలో జమ చేశాడు. ఈ వజ్రానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మేర ధర పలుకుతుందని అధికారులు అంచనా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)