మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లా మాండవీయలో 8 ఏండ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 15 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మాండవికి చెందిన నానక్ చౌహాన్ అనే రైతు తన పొలంతో రెండేండ్ల క్రితం బోరు వేశాడు. అందులో నీళ్లు పడకపోవటంతో దాన్ని అలాగే వదిలేశాడు. ప్రస్తుతం దాన్ని వినియోగించటం లేదు. ఆడుకోవటానికి వెళ్లిన బాలుడు ఆ బోరు బావిలో పడిపోయాడు. బోరు యజమాని మాత్రం నిరుపయోగంగా ఉన్న బోరును కప్పి ఉంచానని చెబుతున్నాడు. చాలా చిన్నగా ఉన్న బోరు బావి రంధ్రంలోకి ఎనిమిదేళ్ల బాలుడు ఎలా పడిపోయాడనేది అనుమానంగానే ఉంది. బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బోరు బావికి సమాంతరంగా గుంత తీసి బాలుడుని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బోరు బావిలో పడ్డ బాలుడు !
December 07, 2022
0