సీఐ నాగేశ్వరరావు లొంగుబాటు !

Telugu Lo Computer
0


అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న మారేడుపల్లి సస్పెండెడ్ సీఐ నాగేశ్వరరావు నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మూడ్రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పెద్ద అంబర్‌పేట  దగ్గర ఎస్‌ఓటీ పోలీసులకు స్వచ్చందంగా లొంగిపోయన నాగేశ్వర్‌రావును రాచకొండ పోలీసులకు అప్పగించారు. సోమవారం రిమాండ్‌కు తరలించనున్నారు. తనపై నమోదైన కేసుల విషయంలో పోలీసులకు పూర్తిగా సహాకరిస్తామనని కాకపోతే దర్యాప్తు నిష్పాక్షికంగా జరపాలని పోలీసులను కోరినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే సీఐ నాగేశ్వర్‌ అరెస్ట్‌ని పోలీసులు రెండ్రోజుల పాటు వెల్లడించలేదనే విమర్శలు వస్తున్నాయి. సీఐ నాగేశ్వరరావు గత 8ఏళ్లుగా టాస్క్‌ఫోర్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని బాగా ఆస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేపిస్ట్ నాగేశ్వరరావు పెద్ద మొత్తంలో డబ్బు సంపాధించడం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. కేవలం తన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని ఒక వివాహితను శారీరకంగా కోరిక తీర్చమని టార్చర్ పెట్టడం ఆమె భర్తను తుపాకీ గురి పెట్టి చంపుతానంటూ బెదిరించడం వంటి నేరాలకు పాల్పడిన కేసులో అరెస్టైన నాగేశ్వరరావు టాస్క్ ఫోర్స్ పేరుతో అడిషనల్ డిసిపిల సహాకారంతో నగరం ఏ జోన్ అయినా విచ్చల విడిగా తిరుగుతూ.. పెద్ద సంఖ్యలో సెటిల్‌మెంట్లు, భారీగా ఆస్తులు వెనకెసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకాలం బెదిరింపులు, మనీ, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసిన నాగేశ్వరరావు పోలీసులకు చిక్కడం అతని కనుసన్నాల్లోనే మాముళ్లు చేతులు మారడం జరిగడంతో ఉన్నతాధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. దో నెంబర్ దందా, క్రికెట్ బెట్టింగ్, డ్రగ్స్ కేసుల్లో భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం. పట్టుబడిన సీఐ ఆస్తులపై దర్యాప్తు చేస్తే తప్ప అతని పేరుతో ఎంత సంపాధన ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయనే కీలకమైన విషయాలు భయటపడుతున్నాయి. అంతే కాదు తన నేరం బయటకు రావడానికి కారణమైన బాధిత దంపతులకు ఎంతైనా నష్టపరిహారం ఇచ్చేందుకు నాగేశ్వరరావు సిద్ధిపడినట్లుగా తెలుస్తోంది. బాధితులను కాంప్రమైజ్ చేసుకునేందుకు తన స్నేహితులను రంగంలోకి దింపినట్లుగా సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)