అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. 110 డాలర్ల కంటే దిగువకు చేరింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 107.18 డాలర్లు పలుకుతోంది. క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. గతంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున విదేశీ ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు వాటి రేట్లు తగ్గడం వల్ల చమురు కంపెనీలపై ఆర్థిక భారం కొంతమేర తగ్గినట్టయింది. దేశీయంగా ఇంధన అమ్మకాల్లో పాత రేట్లే కొనసాగుతున్నాయి. చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.
భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర
July 11, 2022
0
Tags