దేశంలో నిన్న దేశ వ్యాప్తంగా 4,40,278 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 8822 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,45,517 కి చేరింది. నిన్నకరోనా కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,792 కి చేరింది. నిన్న5,718 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,67,088కి చేరింది. ప్రస్తుతం దేశంలో 53,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.66 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 13.58లక్షల మందికి టీకా వేయగా.. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,95,50,87,271 డోసులను పంపిణీ చేశారు.
దేశంలో 8822 కరోనా కొత్త కేసులు నమోదు
June 15, 2022
0