దేశంలో నిషేధం ఉన్నప్పటికీ పబ్‌జి మళ్లీ ఎలా అందుబాటులోకి వచ్చిందో తెలపాలని 'కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ' కార్యదర్శికి జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం తెలపాలని ఆదేశించింది. అలాగే పబ్‌జితోపాటు ఇతర ఆన్‌లైన్ గేమ్స్ గురించిన సమాచారం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)ను కూడా ఆదేశించింది. మైనర్లు ఈ గేమ్ వల్ల బలవుతుండటం, నేరాలకు పాల్పడుతుండటంపై ఎన్‌సీపీసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. పబ్‌జిని దేశంలో నిషేధిస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి ఈ గేమ్ అధికారికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ, అనధికారిక సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. దీంతో చాలా మంది ఇప్పటికీ గేమ్ ఆడుతున్నారు. అయితే, నిషేధించిన గేమ్ ఆన్‌లైన్‌లో ఎలా అందుబాటులోకి వస్తుందో తెలపాలని ఎన్‌సీపీసీఆర్ కోరింది. అంతర్జాతీయంగా పబ్‌జిని ఇ-స్పోర్ట్‌గా గుర్తించారు. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా కూడా దీన్నిఇ-స్పోర్ట్‌గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో పబ్‌జికి ఎలాంటి స్టేటస్ ఉందో తెలపాలని ఐఓఏను కోరింది.
దేశంలో పబ్‌జి నిషేధం ఉన్నప్పటికీ ఎలా వస్తోంది ?
June 15, 2022
0
Tags