నిబంధనలు ఉల్లంఘించిన గుర్తింపులోని దాదాపు 2100 రాజకీయ పార్టీల ప్రక్షాళనకు చర్యలు తీసుకోనున్నట్టు ఎన్నికల కమిషన్ బుధవారం వెల్లడించింది. ఆయా పార్టీలకు అందుతున్న విరాళాల గురించి నివేదికలు సమర్పించక పోవడం, పార్టీ పేరు మారిస్తే చెప్పకపోవడం, అలాగే ప్రధాన కార్యాలయం, పార్టీ సభ్యుల వివరాలు , చిరునామాలు తెలియజేయక పోవడం తదితర నిబంధనల అతిక్రమణపై చర్యలు తీసుకోవడమవుతుందని ఎన్నికల కమిషన్ వివరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలు పాటించకుండా 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయం పన్ను మినహాయింపు కోసం 66 పార్టీలు కోరాయని, 2174 పార్టీలు తమకు అందే విరాళాల నివేదికలు సమర్పించలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. 87 పార్టీలను చిహ్నాల గుర్తింపు జాబితా నుంచి తొలగిస్తున్నట్టు వివరించింది.
గుర్తింపు లేని పార్టీల ప్రక్షాళనకు ఇసి చర్యలు !
May 25, 2022
0
Tags