అజిత్‌సింగ్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్‌ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివాసముంటున్నారు. అజిత్ సింగ్ ఓ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్య సుమన్ తరుచూ అజిత్‌సింగ్‌పై చేయి చేసుకోవడం ప్రారంభించింది. అనేకసార్లు భర్తను ఇష్టం వచ్చినట్లు కొట్టేది. దీంతో భార్య చేతిలో గాయాలపాలైన అజిత్ సింగ్ ప్రస్తుతం వైద్యుల వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే భార్య హింసతో విసిగిపోయిన భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని, ఆమె నుంచి రక్షణ కావాలంటూ కోర్టును కోరాడు. చేతికి ఏది దొరికితే అది క్రికెట్ బ్యాట్, పాన్, కర్రలతో దాడి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కోర్టుకు సమర్పించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో భార్య భర్తను క్రికెట్ బ్యాట్‌తో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అలాగే తల్లి దెబ్బలకు బెదిరిపోయిన కొడుకు ఇంట్లో అటు ఇటు తిరుగుతుండటం కూడా చూడవచ్చు. ఈ కేసును విచారించిన కోర్టు సదరు బాధితుడికి భద్రత కల్పించాలని ఆదేశించింది.
క్రికెట్ బ్యాట్‌తో భర్తపై భార్య దాడి
May 25, 2022
0
Tags