భూసార పరిరక్షణపై చైతన్యం నింపేందుకు సద్గురు జగ్గీ వాసుదేవ్ లండన్ నుంచి భారత్ కు సైకిల్ యాత్రను ప్రారంభించనున్నారు. మార్చి 21వ తేదీ నుంచి ఈ యాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ యాత్రను 27 దేశాల మీదుగా 100 రోజుల్లో పూర్తి చేసి భారతదేశంలో ముగిస్తుందని ఆయన వెల్లడించారు. నేల కాలుష్యాన్ని నివారించడానికి తమ తమ దేశాలలో విధాన ఆధారిత చర్యలను ప్రారంభించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను కోరడానికి తాను లండన్ నుంచి భారతదేశానికి ఒంటరిగా 30 వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర ఉంటుందన్నారు. ఈ 100 రోజుల యాత్రలో ప్రతి ఒక్కరూ కనీసం రోజులో 5 నుంచి 10 నిమిషాల పాటు మట్టి పరిరక్షణ గురించి గొంతు విప్పాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచించారు. ప్రపంచం మొత్తం 100 రోజుల పాటు మట్టి గురించి మాట్లాడాలి" అని జగ్గీ వాసుదేవ్ ది సేవ్ సాయిల్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించినున్నారు.
లండన్ నుంచి భారత్ కు సద్గురు సైకిల్ యాత్ర
March 03, 2022
0
Tags