బాలికను లొంగదీసుకోడానికి ఖరీదైన ఫ్లాట్?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్మల్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మెన్, టిఆర్ఎస్ బహిష్కృత నేత సాజిద్ ఖాన్ సహా అతనికి సహకరించిన అనురాధ, జాఫర్ అనే మరోఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిర్మల్ గ్రామీణ మండలం అనంత పేట్ గ్రామ శివారులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాజిద్ ఖాన్ తోపాటు అత్యాచార ఘటనలో అతడికి సహకరించిన కారు డ్రైవర్ జాఫర్, అనురాధ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి కారు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డిఎస్ పి ఉపేంద్ర రెడ్డి మీడియాకు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని వైయస్సార్ నగర్ కాలనీలో నివాసముండే అనురాధ తో మున్సిపల్ వైస్ చైర్మన్ కు కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది. అనురాధ ఇంటి పక్కనే ఉండే బాలికపై కన్నేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ పాపను తన వద్దకు పంపించాలని, దానికి బదులుగా ఒక ఇంటి ఫ్లాట్ గిఫ్టుగా ఇస్తానని అనురాధకు ఆశ చూపించాడు. దీంతో అనురాధ బాలిక తల్లి దగ్గరికెళ్లి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంది.. పాపనూ తీసుకుపోతామంటే, వెంట అనురాధ ఇద్దరు కుమారులు కూడా ఉండటంతో పిల్లల్లో కలిసిపోతుందని భావించి పంపడానికి ఒప్పుకుందా తల్లి. అయితే బాలిక వలలో చిక్కిన తర్వాత నిజామాబాద్ వెళ్లకుండా మున్సిపల్ వైస్ చైర్మన్ తో కారులో హైదరాబాద్ కు తీసుకువెళ్ళింది. హైదరాబాదులోని ఒక లాడ్జిలో బాధితురాలిపై వైస్ చైర్మెన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపి వేస్తాడని బాధితురాలిని అనురాధ బెదిరించడంతో బాధితురాలు ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. తిరిగి 10వ తేదీన వారిని నిర్మల్ కు పంపించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టి కి తీసుకెళ్లగా బాధితురాలిని సఖి సెంటర్ కు పంపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులు అడ్వకేట్ ను కలిసేందుకు నిర్మల్ కు వస్తుండగా నీలాయిపేట శివారులో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డిఎస్పి పేర్కొన్నారు. వీరిపై ఫోక్సో చట్టం 363, 376 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ రోజు నిందితుడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)