ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. విద్యార్థులు బందీలుగా ఉండటం పై తమకు ఎలాంటి నివేదికలు అందలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉందని, ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారని చెప్పింది. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. అలాగే భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.
ఎలాంటి నివేదికలు అందలేదు : విదేశాంగ శాఖ
March 03, 2022
0
Tags