హైదరాబాద్ లోని కుంట్లూర్ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే మంచికంటి బంగారురాజు (32) ప్రైవేటు ఉద్యోగి. 24న అతడి భార్య ప్రసన్న ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన అతడు గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం స్థానికంగా ఉండే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య!
March 27, 2022
0