ఇండియా నుంచి విదేశాలకు ఎగుమతులు పెరిగాయన్న విషయాన్ని మాన్ కీ బాత్ లో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ చెప్పారు. ఇండియా ఏకంగా 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని ప్రధాని మోడీ ప్రకటన చేశారు. గతంలో ఎగుమతుల విలువ 100 బిలియన్ డాలర్లు, కొన్ని సార్లు 150 బిలియన్ డాలర్లు, కొన్ని సార్లు 200 బిలియన్ డాలర్లు ఉండేవని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 400 బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇండియాలో తయారయ్యే వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని దీని ద్వారా తెలుస్తోందని చెప్పుకొచ్చారు.
400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాం
March 27, 2022
0