మంటల్లో రెండు ట్రక్కులు బూడిద : కోట్ల రూపాయల మద్యం ఆవిరి

Telugu Lo Computer
0


హర్యానాలోని నలాగఢ్ నుంచి మద్యం బాటిళ్లతో ఓ ట్రక్కు ఢిళ్లీకి వెళ్తోంది. శామ్‌గఢ్‌ దాటిన తర్వాత వెనక నుంచి మరో ట్రక్కు దూసుకొచ్చి ఈ ట్రక్కును ఢీకొట్టింది. మద్యం లోడుతో ఉన్న ట్రక్కును ముందుకు ఈడ్చెళ్లింది. అనంతరం డివైడర్‌ను ఢీకొట్టి రెండు ట్రక్కులూ ఆగిపోయాయి. అయితే కాసేపటికే మద్యం లోడుతో ఉన్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఆల్కాహాల్‌కు మండే స్వభావం ఉండడంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలను చూసి ట్రక్కు డ్రైవర్లు కిందకు దూకేశారు. ఆ తర్వాత చూస్తుండగానే రెండు ట్రక్కులూ కాలిపోయాయి. ట్రక్కులో ఉన్న సరుకుంతా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వేరొక మార్గంలో వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గురైన ట్రక్కులను క్రేన్‌ల సాయంతో అక్కడి నుంచి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)