ప్రపంచంలోనే అత్యంత శబ్ద కాలుష్య నగరాల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం 2022కి గానూ ప్రచురించిన “వార్షిక సరిహద్దు నివేదిక”లో ఈ విషయాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శబ్దకాలుష్య ప్రాంతాలుగా 61 నగరాలతో కూడిన జాబితాను UNEP ఇటీవల విడుదల చేసింది. వీటిలో 119 డెసిబుల్స్ తో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అగ్రస్థానంలో ఉండగా.. 114 డెసిబుల్స్ తో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా, అసాన్సోల్ నగరాల్లో 89 డెసిబుల్స్, జైపూర్ 84 డెసిబుల్స్, ఢిల్లీలో 83 డెసిబుల్స్ స్థాయిలో శబ్ద కాలుష్యం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. జాబితాలోని టాప్ 15 నగరాల్లో మూడు అగ్రస్థానాలు భారత్ నాగరాలే ఉండడం దేశంలో శబ్ద కాలుష్య పరిస్థితికి అద్దం పడుతుంది. రోడ్డు ట్రాఫిక్, ఎయిర్ ట్రాఫిక్, రైల్వేలు, యంత్రాలు, పరిశ్రమలు మరియు వినోద కార్యకలాపాలు వంటి కారకాల నుంచి శబ్ద కాలుష్యం వెలువడుతుందని ఇది మనుషుల శారీరక మరియు మానసిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాల మేరకు.. ప్రాంతాలను పరిస్థితులను బట్టి “శబ్ద స్థాయిలు” నిర్ణయించబడ్డాయి. నగరాల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లో ఆ స్థాయి పరిమితి 55 డెసిబుల్స్ గా నిర్ణయించగా..బహిరంగ ప్రాంతాలు, ట్రాఫిక్, పారిశ్రామిక వాడల్లో ఆ పరిమితి 70 డెసిబుల్స్ గా నిర్ణయించారు. ఈ పరిమితికి మించి శబ్ద కాలుష్యం పెరిగితే..రానున్న రోజుల్లో మనుషుల్లో వినికిడి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక UNEP విడుదల చేసిన వార్షిక నివేదికలో..60 డెసిబుల్స్ వద్ద జోర్డాన్ లోని ఇర్బిడ్, 69 డిబి వద్ద ఫ్రాన్స్ లోని లియోన్, 69 డిబి వద్ద స్పెయిన్‌లోని మాడ్రిడ్, 70 డిబి వద్ద స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ మరియు సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ నగరాలూ ప్రపంచంలోని నిశ్శబ్ద నగరాలుగా నిలిచాయి.
ప్రపంచంలో అత్యంత శబ్ద కాలుష్య రెండవ నగరం మొరాదాబాద్
March 27, 2022
0
Tags