షెఫాలీ వర్మ, స్మృతి మంధన, మిథాలీరాజ్ అర్ధ సెంచరీలు

Telugu Lo Computer
0


ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో సెమీ ఫైనల్స్ చేరుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన, షెఫాలీవర్మలతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా గెలవడానికి 275 పరుగులు చేయాలి. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న షెఫాలీవర్మ జట్టు స్కోరు 91 వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగారు. ఆమె 46 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేశారు. కేవలం 40 బంతుల్లోనే ఆమె అర్ధసెంచరీ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన యాస్తిక భాటియా కేవలం 2 పరుగులకు అవుటయ్యారు. మిథాలీ సహకారంతో స్మృతి మంధన ఇన్నింగ్స్ నడిపించారు. ఆమె 69 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 93 బంతుల్లో 80 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 176 పరుగుల వద్ద స్మృతి మంధన (84 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యారు. ఆ తర్వాత హర్మన్ ప్రీత్, కెప్టెన్ మిథాలీరాజ్ సమన్వయంతో ఆడుతూ జట్టు స్కోరును 200 దాటించారు. ఇదే క్రమంలో 69 బంతుల్లో మిథాలీ అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నారు. ఆర్వాత నాలుగో వికెట్‌గా మిథాలీ (84 బంతుల్లో 68: 8 ఫోర్లు) వెనుదిరిగారు. పూజ వస్త్రకర్ (3), రిచా ఘోష్ (8) విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన హర్మన్ ప్రీత్ కౌర్ (57 బంతుల్లో 48; 4 ఫోర్లు) కొద్దిలో అర్ధసెంచరీని కోల్పోయారు.ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో గెలిచి మూడింటిలో ఓడిన భారత్ ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఎలాంటి అడ్డంకులు లేకండా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి తీరాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)