తమిళనాడు లో యువతిపై అత్యాచారం

Telugu Lo Computer
0


తమిళనాడు లోని విరుదునగర్ జిల్లా అరుబ్బుకోటకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి ఈ నెల 23న బీచ్‌కు వెళ్లింది. వారిద్దరూ సముద్రపు ఒడ్డున కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చి ప్రియుడిని  చితకబాది యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె వంటిపై వున్న నగలను దోచుకుని పారిపోయారు. జరిగిన ఘటనకు తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పద్మాశ్వరన్, దినేష్ కుమార్, అజిత్‌లను అరెస్టు చేసేందుకు వెళ్లగా పోలీసులపై దాడి చేసి వారు పారిపోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)