ఒడిశా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 108 స్థానాలకు గానూ 76 స్థానాలను బీజేడీ కైవసం చేసుకోగా 16 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు మిగతా స్థానాల్లో గెలుపొందారు. గెలుపొందిన అన్ని స్థానాల్లోనూ మేయర్, చైర్ పర్సన్ పదవులను అధికార పార్టీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో మునిసిపల్ చట్టం సవరించిన అనంతరం మొదటిసారి నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రజలే మేయర్, మునిసిపల్ చైర్ పర్సన్ లను ఎన్నుకొనే విధంగా ఓటు హక్కు కల్పించారు. గత నెలలో ఒడిశాలోని 30 జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ 852 జిల్లా పరిషద్ స్థానాలకు గానూ 766 స్థానాల్లో బీజేడీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఇక ఈ రెండు ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ లు అధికార పార్టీకి కనీస పోటీ ఇవ్వలేకపోయాయి.ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఆ ప్రభావం ఒడిశాలో ఏ మాత్రం కనిపించలేదు. ఈవిజయాన్నిభట్టి చూస్తుంటే ఇప్పుడపుడే ఒడిశాలో బీజేడీకి మరో ప్రత్యామ్న్యాయం ఉండే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేడీ క్లీన్ స్వీప్
March 27, 2022
0
Tags