చర్చిలో గన్‌మెన్ కాల్పులకు ఐదుగురి బలి !

Telugu Lo Computer
0


అమెరికా లోని కాలిఫోర్నియాలో శాక్రమెంటోలోని చర్చిలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఐదుగురు మరణించారు.సోమవారం సాయంత్రం కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని ఒక చర్చిలో ఓ గన్ మెన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పిల్లలతో కలిసి ఐదుగురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలోని ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలో ఉన్న చర్చిలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారని కాలిఫోర్నియా పోలీసులు చెప్పారు.చర్చిలో కాల్పుల ఘటన అనంతరం పోలీసులు, అత్యవసర సేవలు అందించే సహాయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. చర్చిలో గన్ మెన్ ఎందుకు కాల్పులు జరిపాడనేది ఇంకా తెలియలేదు. దుండగుడు చర్చీలో తుపాకీతో కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)