అమూల్ పాలు ప్రియం కానున్నాయి. మార్చి 1 నుంచి లీటరుపై రూ.2 పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ. రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.27 కానున్నాయి. పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం వ్యయాలు అధికం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. గత రెండేళ్లలో తాజా పాల ధరను 4 శాతం మాత్రమే పెంచామని పేర్కొంది. చివరగా 2021 జులైలో లీటరుకు రూ.2 చొప్పున అమూల్ పెంచింది.
అమూల్ పాలు లీటరుకు రూ.2 పెంపు
March 01, 2022
0
Tags